TELUGU ARTICLES (తక్కువ రక్తపోటు) [low blood pressure]

 

low bp1                                                                                              lowbp-symptomsలో.బీపీ   లేక   తక్కువ రక్తపోటు :- రక్తపోటు 120/80 యామ్ యామ్ హెచ్ జి‌ నార్మల్ గాను,దీనికి ఎక్కువయితే  హై బీపీ గాను, తక్కువయితే లోబీపీ గాను డాక్టర్స్ గుర్తించారు. అయితే దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే మనం తీసుకొనే ఆహారం కడుపులో జీర్ణమయిన తర్వాత చిన్న ప్రేగుల గోడల లోపలి పొరలో ఉన్న చిన్న రక్తనాళాల గుండా అత్యంత శక్తినిచ్చే పొషకపదార్దాలు, మరియు నీరు, బయోటెక్ ,విటమిన్ .కె  లాంటివి పెద్ద ప్రేవులు ద్వారాను, రక్తంలోకి గ్రహించి గుండె స్పందన వలన శరీరంలోని అణువణువునకు అందించబడును. ఈ ప్రక్రియలో ఏది తేడా వచ్చినా, మనిషి ఆరోగ్యంలో వ్యాధులు,బాధలు రూపంలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. అలాగే హైబీపీ లక్షణాలకు నేను వ్రాసిన హై బీపీ ఆర్టికల్ చదవండి. ఇకపోతే       లో బీపీ కలవారికి , వికారం, కళ్ళు తిరగటం , స్పృహ కోల్పోవటం జరుగుతుంది. వీరు ఏవిషయం పైనా మనస్సులగ్నం చేయలేరు. శరీరం చల్లగా ఉండి, చర్మం పాలిపోయి ,శ్వాస సమంగా తీసుకొనలేరు. చూపు మసకబారుతుంది. లో బీపీ రావటానికి గల కారణాలు ప్రముఖకంగా చెప్పుకోవాలంటే కొన్నిఇంగ్లీషు మందుల ఎలర్జీల రియాక్షన్లు, వాంతులు, విరోచనాలు, దీర్ఘ కాలిక విష జ్వరాలు,ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల్లో జరిగే అధిక రక్త స్రావాలు, నెలసరిలో అధిక రక్తస్రావం జరిగే స్త్రీలలోనూ, గర్భిణీ స్త్రీలలోనూ , సమతుల్య ఆహారం తీసుకోలేని వారిలోనూ, ఆహారం దొరకని కరువు ప్రాంతాల వారిలోనూ, ఎక్కువగా ఉపవాసాలు చేసేవారిలోనూ, వారసత్వంగాను, హార్మోన్ల సమతుల్యత కోల్పోయిన వారిలోనూ, రక్తలేమికి దారి తీసే కొన్ని ప్రమాదకరమయిన జబ్బులలోనూ, గుండె జబ్బులలోనూ, షుగర్ వ్యాధిగ్రస్తులలోనూ, వ్యాయామం చేయని వారు  లోబీపీ కి కారణభూతులవుతారు.  ఏకారణంచేతనయినా రక్తపోటు బాగా పడిపోతే ముఖ్యంగా గుండెకు ,మెదడుకు , ఆక్సిజన్ మరియు పోషక పదార్దాలు అందక స్పృహ కోల్పోయి మరణించ వచ్చును. కాబట్టి ప్రతివారు శరీర అవయవాలు, వాటి జీవన విధానాలు, జబ్బుల గురించి అవగాహన కలిగి వుండాలి.  ఎప్పటికప్పుడు బీపీ,షుగర్,థైరాయిడ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆసక్తిగలవారు సంప్రదించవచ్చును. సెల్ .9866857484, 964033886   FB- krishna murty raju alluri,  FB. DR A K RAJU dhms

లో బ్లడ్ ప్రెషర్ కలుగుటకు గల కారణములు:-

[1]  అడ్రినల్ గ్రంది అలసి నీర్సంగా పని చేయుట వలనను.

[2]  నాడీ వ్యవత్స పని చేయుటలో కుంటుపడటం.

[3]  దీర్ఘ కాలిక వ్యాధులవలన మరియు వాంతులు విరోచనాలలో శరీరంలో గల నీటి శాతం తగ్గుట వలనను.

[4]  గర్భిణీ సమయంలో విటమినులు, మినరన్స్, ఐరన్, కాల్షియం మొదలగు పౌష్టిక ఆహార లోపం వలనను.

[5]  కొన్ని వ్యాధులలో ఇంగ్లీష్ మందులు దీర్ఘ కాలంగా  వాడుట వలనను.

[6]  ఆర్దిక పరిస్తితుల వలన సమతుల ఆహారం పొందలేక పోవుట వలన గాని, కలుషిత ఆహారం తినుట వలనను.

[7]  స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి నార్మల్ కన్నాతక్కువగా విడుదల ఆగుట వలనను, బీపీతగ్గి కళ్ళు తిరుగుట వలనను.

మొదలగునవి ముఖ్య కారణములుగా చెప్పుకోన వచ్చును.

లో బీపీ వలన కలుగు లక్షణములు

చూపు మసక బారడం , లోతుగాను, వేగంగాను  శ్వాస తీసుకొనుట, వికారం, దాహం, పాలిపోయిన చల్లని చర్మమును కలిగి యుండుట, శారీరికంగా బాగా అలసి పోవుట, ఏపనిపైనా మనస్సు లగ్నం చేయలేక పోవుట, కళ్ళు తురుగుట, గుండె దడ, రోగి అయోమయ పరిస్తితులలో ఉండుట మొదలగునవి ముఖ్యమైన లక్షణములుగా చెప్పవచ్చును.  హై బీపీ కన్నా లోబిపి చాలా ప్రమాదకరమైందని పాఠకులు గ్రహించగలరు.  DR A K RAJU dhms

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *