TELUGU ARTICLES హెచ్చు రక్తపోటు [HIGH BLOOD PRESSURE]

అధిక రక్తపోటు  లేక   హై బ్లడ్ ప్రెషర్ :– రక్తపోటు పెరిగినవారికి ఉండే లక్షణాలు ఏమనగా, తల బరువుగా ఉన్నట్లుగా అనిపించి కళ్ళు తిరగటం,వికారం ,తలనొప్పి ఉంటాయి . అప్పుడు గుండె పట్టినట్లు ఉండి గుండె దడతో ఊపిరి పీల్చ లేకపోతారు, కందగడ్డలాంటి మొఖంతో, కళ్ళు ఎరుపులెక్కి,కోపం చిరాకుతో మండిపడి పోతుంటారు. అప్పుడు శరీరం ఒణుకు అలసట నీర్సంతో నిద్ర పట్టదు. ఛాతీ నొప్పితో కంటి  చూపు మసక బారుతూ, వీపి ,మోకాళ్ళు పచ్చి  పుండులాగ ఉంటాయి.  ఈ పరిస్తితులలో గుండెతో పాటు, కిడ్నీకూడా దెబ్బతిని, ఊపిరితిత్తులకు నీరు పట్టే అవకాశం ఉంది. రక్త నాళాలలో మెత్తదనం సాగుడు గుణం తగ్గి పెళుసెక్కుతాయి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకొనుట వలన నాళాల్లోని రంద్రము సన్నగిల్లి రక్తప్రవాహం సాఫీగా, వేగంగా సాగదు. కాబట్టి గుండె వత్తిడితో కొట్టుకొనవలసి వస్తుంది ఈపరిస్తితులలో రక్త నాళాలలో రక్తపు కుదుప ఏర్పడవచ్చును, ఇదంతా అధిక రక్తపోటు వలన వచ్చే అనర్దం అని చెప్పుకోవచ్చును. ఇలాంటి పరిస్తితులలో  కొన్ని రోజులకు గుండె కండరాలు అలసి,గుండె స్పందన క్రమం తప్పి శరీరానికి తగినంత రక్త ప్రసరణ చేయలేదు. డయాబెటిక్ రోగులు ఈ అధిక రక్త పోటు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్న వారిలో  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారి మిగిలిన శరీర అవయవాలు త్వరితగతిన పాడయ్యే అవకాశం ఉంది.

కారణాలు:- పిట్యూటరీ ,థైరాయిడ్,అడ్రినల్ మొదలగు గ్రంధుల లోపాలవలన వాటి ఉత్పత్తుల సమతుల్యాన్ని కోల్పోవటం, వారసత్వం,ఊబకాయం,అధిక బరువు పెరగడం,నిత్యము వ్యాయామం చేయకపోవటం,తరచూ అధిక మానసిక వత్తిడికి లోనవటం ,వయోభారం,అధిక ఉప్పు,మసాలా వాడకం,ఆల్కహాల్,సిగరెట్, గుట్కా, జరదా,మత్తు మందులు ఎక్కువగా వాడకంతో పాటు , వెన్న,నెయ్యి, మీగడ,బాకారి ఫుడ్డు ,జంక్ ఫుడ్డు,బిర్యానీ,పులావ్ లాంటి మసాలా ఫుడ్స్  తరచుగా తీసుకోవటం హై బీపీ రావటానికి ముఖ్య కారణాలుగా చెప్పుకొనవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరూ డాక్టరు గారి సలహా మేరకు ప్రతి రోజూ జాగ్రత్తలు పాటించాలి .గుండెకు  సంబందించిన అన్నీ సమస్యలకు మా హోమియో హెర్బల్ మందులు దీర్ఘకాలికంగా అద్బుతంగా పనిచేస్తాయి.ఆసక్తిగలవారు సంప్రదించవచ్చును.                                                                                                                                                     సెల్ .9866857484, 964033886   FB- krishna murty raju alluri,  FB. DR A K RAJU.   web: www.drakraju.webpagesdemo.com

 

 

high bp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *