TELUGU ARTICLES గుప్పెడంత గుండె [ THE HEART ]

ప్రతి మానవుడికి తమ రెండు ఊపిరితిత్తుల మధ్య ఛాతీలో, కండరాలతో తయారయిన నాలుగు గదులు, మరియు గదుల మద్య వాల్వ్స్ తో కలిగిన ఉన్న గుప్పెడంత గుండె అమరి ఉంటుంది. ఇది మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మనం సహకరిస్తే విరామం అనకుండా పని చేస్తూనే ఉంటుంది. అది సెలవు ప్రకటిస్తే మనం జీవితం చాలించినట్లే. శరీర అవయవాలలో గుండె ప్రధానమైనది. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలో అమరి ఉన్న మంచి, చెడు రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహిస్తూ దాని ద్వారా హార్మోన్లను, పోషక పదార్దాలను, ఆక్సీజెన్ ను అనువణువునకు చేరవేసి, జీవరసాయన ప్రక్రియలో వెలువడిన వ్యర్ద పదార్దాలను తిరిగి చెడు రక్త నాళాల ద్వారా ఊపిరితిత్తులకు, మూత్రపిండాలకు చేరవేసి రక్తాన్నిశుద్ది చేయించే భాద్యత కూడా గుండెదే. మనం తీసుకొనే ఆహారం కొన్ని ఎంజైములు, హార్మోన్ల ద్వారా జీర్ణమయిన మీదట అందులోని పోషక పదార్దాలను, ఆక్సీజెన్ ను గుండె ద్వారా శరీర జీవ కణాలకు అందించి, అవి ఆరోగ్యంగా జీవించ గలిగే మహత్ కార్యాన్ని గుండె అను క్షణం చేస్తూనే ఉంటుంది. ఈ ప్రక్రియలో గుండె గదికి గదికి మద్య గల వాల్వ్స్ మంచి చెడు రక్తాలను కలవ కుండా కాపాడుతాయి. ఊపిరితిత్తులు,మూత్రపిండాలు రక్తశుద్దిని చేస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో గుండెకు భారమయ్యే అల్కోహాల్, ధూమపానం, డ్రగ్స్ లాంటి మత్తు మందులను తీసుకొనడం, శారీరిక, మానసిక విరామం లేకుండా జీవించటం లాంటి వన్నీ మనకు మనంగా ఆయుషు ను తగ్గించు కొనడమే అవుతుంది. సాధారణంగా గుండె స్పందన పెద్దవారిలో నిముషానికి 72 సార్లు, శ్వాస 18 సార్లు, నాడి కొట్టుకొనుట నిముషానికి 60 నుండి 100 వరకు వారి శారీరిక, మానసిక ఆరోగ్యం పరిస్తితులపైన ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సు లో ఉన్నవారికి పై స్పందనలు కొద్ది ఎక్కువగా ఉంటాయి. బాక్టీరియా, వైరస్ వ్యాధులు సోకినపుడు, మరికొన్నిమానసిక అసాధారణ పరిస్తితులలోను, శరీర జీవరసాయన ప్రక్రియలో వచ్చిన లోటు పాట్ల సందర్భాలలోనూ పైన సూచించిన స్పందనలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరు తమ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ, తమ కుటుంబ ప్రగతికి, దేశ పురోగాభివృద్దికి పాటుపడటంలో విజ్నత ప్రదర్శించితే అంతకన్నా ఎవరికి మాత్రం ఏమికావాలి. గుండె పని చేసే తీరును ప్రతి సామాన్యుడు అర్ధము చేసు కొంటాడనే ఉద్దేశ్యంతో తెలుగులో ఉన్న ఈ రెండు వీడియోలను పొందు పరచు చున్నాను. గమనించ ప్రార్ధన. కాబట్టి ఈ తెలుగు ఆర్టికల్ ను మీ ద్వారా మరికొంత మందికి షేర్ చేసి వారికి కూడా అవగాహన కలిగే అవకాశాన్ని ప్రసాదించ గలరని ఆశిస్తున్నాను. DR. A. K. RAJU D.H.M.S BHIMAVARAM. W.G.DIST. A P CELL:9866857484.

 

human-heart

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *